¡Sorpréndeme!

MI vs RCB Match Records IPL 2025 | పదేళ్ల తర్వాత ముంబై గడ్డపై ఆర్సీబీ ఘన విజయం

2025-04-08 1 Dailymotion

 ముంబైపై ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో ఆర్సీబీ టీమ్ పై చేయి సాధించి ముంబైని మట్టికరిపించింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది మ్యాచ్ గెలగానే కింగ్ విరాట్ కొహ్లీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్, పాండ్యా చూసేలా పెద్ద పెద్దగా అరుస్తూ గ్రౌండ్ లో చాలా యానిమేటెడ్ గా తిరిగాడు కొహ్లీ. దీనికి రీజన్ ఏంటో తెలుసా అక్షరాలా పది సంవత్సరాల తర్వాత ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్ గెలిచింది ఆర్సీబీ. ఎస్ పదేళ్లుగా ముంబైలో ఆడిన ప్రతీసారి ఆర్సీబీకి ఓటమి చవి చూసింది. ముంబై గెలుస్తూనే ఉంది ఆ విన్నింగ్ స్ట్రీక్ కి ఈసారి బ్రేక్ వేశారు ఆర్సీబీ ప్లేయర్లు. ఈసారే ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. పదిహేడేళ్లుగా చెన్నై చెపాక్ స్టేడియంలో గెలుపు ఎరుగని ఆర్సీబీ అక్కడ కూడా ఈ సారి జెండా ఎగురేసింది. మొన్న జరిగిన మ్యాచ్ లో చెన్నైను మడతపెట్టేసి ధోని కోటను బద్ధలు కొట్టింది. ధోనీ, రోహిత్ శర్మ ఇద్దరూ చెన్నై, ముంబైలకు కెప్టెన్లు కాకపోయినా ఆ ఫ్రాంచైజీలు వాళ్లు నిర్మించుకున్న సామ్రాజ్యాలు. వాళ్ల అభిమానులు కూడా ఇప్పటికీ వాళ్లనే కెప్టెన్ లుగా చూస్తారు. సో వాళ్లిద్దరికీ సమఉజ్జీ అయిన విరాట్ కొహ్లీ ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్ కప్పు గెలవకపోయినా 18వసారి దండయాత్రలో ఎవరైతే ఛాంపియన్స్ లు ఇన్నాళ్లూ రికార్డులకెక్కారో వాళ్లందరినీ వాళ్ల సొంత గడ్డపైనే ఓడిస్తూ వస్తున్నారు. ఈ సీజన్ లో మూడో విజయాన్ని నమోదు చేశారు. అదే కొహ్లీ ఆనందానికి కారణం. అఫ్ కోర్స్ కొహ్లీ కూడా ఆర్సీబీ కి కెప్టెన్ కాదు కానీ ఆర్సీబీ అనేది కొహ్లీ నిర్మించుకున్న సామ్రాజ్యం. సో ఆ ఎమోషన్ ఇదిగో అచ్చం ఇలానే తన్నుకొస్తది అన్నమాట.